చరిత్రను తిరగరాసిన చిన్న దేశం..!

#ఇరాన్ #అమెరికా #సీజ్ ఫైర్

Apr 9, 2026 - 12:12
Apr 9, 2026 - 12:36
 0  5
చరిత్రను తిరగరాసిన చిన్న దేశం..!

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక దళాలను కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ ఒకే వేదికపై నిలబడినప్పుడు.. చాలా దేశాలు వారాల్లో మోకరిల్లుతాయి. కానీ ఇరాన్ అలా చేయలేదు. 40 రోజులు.. ఒక్కో రోజూ, ఒక్కో దాడినీ తట్టుకుని.. చివరకు ప్రపంచం ముందు తలెత్తుకు నిలబడింది. 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై ఆకస్మిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్‌ సుప్రీమ్ లీడర్ అలీ ఖమేనీ హతమయ్యారు. సైనిక స్థావరాలు, ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్‌ను విచ్ఛిన్నం చేస్తుందని శత్రువులు భావించారు. కానీ జరిగింది వేరు. నాయకత్వం లేకున్నా ఇరాన్ సైన్యం ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. మిసైళ్లు గాల్లోకి లేచాయి. డ్రోన్లు సరిహద్దులు దాటాయి. ఇరాన్ పోరాటం మొదలైంది. బ్యాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్ సమూహాలతో ఇరాన్ సమయాన్ని వ్యూహాత్మక ఆయుధంగా మార్చుకుంది. ఇజ్రాయెల్ ఇంటర్‌సెప్టర్ నిల్వలను హరింపజేయడం, నిరంతర ఆర్థిక నష్టం కలిగించడం ఇరాన్ లక్ష్యాలుగా నిలిచాయి.


ఒకేసారి పెద్ద దాడి కాదు.. నిరంతరం, విరామం లేకుండా, శత్రువుని అలసిపోయేట్టు చేయడం. ఇదే ఇరాన్ వ్యూహం. యుద్ధంలో అది బాగా పని చేసింది. ఇక ఇరాన్ హార్మూజ్ జలసంధిలో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు పైకి చేరింది. గల్ఫ్ రాజ్యాలన్నీ ఇరాన్ దాడులను ఎదుర్కొన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు మొదలయ్యాయి. ఒక్క నిర్ణయంతో ప్రపంచ ఆయిల్ మార్కెట్‌ని కంపించేసింది ఇరాన్. తమపై యుద్ధం చేస్తే తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఆపగలమని చాటుకుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ యుద్ధం అమెరికాకు సంపూర్ణ విపత్తుగా మారింది. వైట్ హౌస్ ఒక దారి వెతుక్కుంది.. సీజ్‌ఫైర్‌ రూపంలో యుద్ధం నుంచి తప్పుకుంది. మరో విధంగా చెప్పాలంటే పారిపోయింది. హార్మూజ్‌ని తెరవండి, చర్చలకు రండని అమెరికా పిలించింది. కానీ.. తమ షరతులు ఏమిటో ముందు చదవండి.. ఆ తర్వాతే చర్యలు అని ఇరాన్‌ సమాధానమిచ్చింది. ఆమెరికాకు వేరే ఆప్షన్‌ లేకపోయింది. ఇరాన్‌ షరతులకు అంగీకరించింది. అలాగే అమెరికాతో నేరుగా చర్చలు జరపమని.. ఇస్లామాబాద్‌లో మీటింగ్‌ పాయింట్‌ అరేంజ్‌ చేసింది ఇరాన్‌. ఇలా ప్రతీ ఒక్క విషయంలో కూడా తన పంతం నెగ్గించుకుంది. అదికూడా ఆగ్రరాజ్యానికి వ్యతిరేకంగా. 

సీజ్‌ఫైర్ ప్రకటన వెలువడిన వెంటనే టెహ్రాన్, బాగ్దాద్ వీధుల్లో జనం పోటెత్తారు. ఇరాన్ నాయకులు ఈ యుద్ధం తమ షరతులపైనే ముగిసిందని ప్రకటించారు. ఇది కేవలం సీజ్‌ఫైర్ కాదు. ఇది ఒక చిన్న దేశం అగ్రరాజ్యం ముందు కూడా బలంగా నిలబడగలదని నిరూపించిన క్షణం. ఈ 40 రోజుల యుద్ధంలో ఇరాన్ నేర్పిన పాఠాలను చూస్తే.. సుప్రీమ్ లీడర్ లేకపోయినా పోరాటం ఆగలేదు. సంకల్పాన్ని వీడలేదు. ఒకేసారి పెద్దగా దాడి చేయడం కాదు.. నిరంతర ఒత్తిడే అమెరికాను అలసిపోయేలా చేసింది. అదే ఇరాన్‌ వ్యూహం. హార్మూజ్ మూసివేత ప్రపంచాన్ని చలింపజేసింది. చివరకు తమ 10 షరతులతో చర్చల వెళ్లనున్నారు. ఇక్కడ ఇరాన్‌ దౌత్యం ప్రదర్శించింది. 

రాబోయే రెండు వారాలు అత్యంత కీలకమైనవి. మరి ఇవి నిజమైన దౌత్యానికి దారితీస్తాయా..? లేదా మళ్లీ ఉద్రిక్తతలు మొదలవుతాయా..? అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. మొత్తానికి 40 రోజులపాటు అమెరికాను, ఇజ్రాయెల్‌ను, ప్రపంచాన్ని ఒకేసారి ఎదుర్కొంది ఇరాన్. తలవంచలేదు. తన షరతులపైనే సీజ్‌ఫైర్ సాధించింది. ఇరాన్‌ చుట్టూ టెర్రిరిస్ట్‌ క్యాంపులు ఉండవచ్చు. పాకిస్తాన్‌లా టెర్రిరిజాన్ని పెంచి పోషించవచ్చు. కానీ.. అమెరికాను ఎదురొడ్డి యుద్ధంలో నిలిచిన తీరు మాత్రం అసామాన్యం. చరిత్రలో ఇది ఒక చిన్న దేశం అగ్రరాజ్యాన్ని వెనక్కి నెట్టిన అరుదైన అధ్యాయంగా నిలిచిపోతుంది.