2029 పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదేనా..?

Mar 23, 2026 - 09:43
Mar 23, 2026 - 09:50
 0  7
2029 పవన్ కల్యాణ్ ప్లాన్ ఇదేనా..?

బైబైలో బంగారు రమణమ్మా అంటూ పవన్ కల్యాణ్ ఖుషీలో ఓ పాట పాడతాడు. అది శ్రీకాకుళంది అని చాలా బాగుంటుందని చెబుతాడు. అలా శ్రీకాకుళం జానపదం మీద పవన్ ఎప్పుడో మనసు పారేసుకున్నాడు. అలాగే గిరిజనుల జీవితాల మీద కూడా కల్యాణ్‌కి ఆసక్తి ఎక్కువే. అందుకే పవన్ కల్యాణ్ అడవి వైపు ఎక్కువగా వెళుతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఇది మామూలుగానే జరుగుతుందా.. దీని వెనక వ్యూహం ఉందా?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైకి మామూలుగా ఉంటూనే.. తన వ్యూహం తాను డెవలప్ చేసుకుంటూ వెళుతున్నట్లు తెలుస్తోంది.  2029 ఎన్నికలకు సైతం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. పవన్ అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అందరూ అవి అంత ప్రయారిటీ లేనివి కదా అంటూ పెదవి విరిచారు. కాని వాటినే అస్త్రాలుగా చేసుకుని పవన్ కల్యాణ్ తన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. 
పవన్ కల్యాణ్ పదే పదే ఏజెన్సీ ఏరియాలకు వెళుతున్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఏరియాల్లో పర్యటిస్తూ.. అక్కడ తన రెండు శాఖల నుంచి నిధులను విడుదల చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నారు. 70 ఏళ్లుగా రోడ్డు లేని చోట రోడ్డు వేయించారు. గిరిజనులతో మమేకం కావడానికి కూడా అనేక సందర్భాలను పవన్ కల్యాణ్ వాడుతున్నారు. తన బర్త్ డే అప్పుడు అక్కడే ఉన్నారు... ఈ మధ్య జనసేన ఆవిర్భావ దినం కూడా అక్కడే జరుపుకున్నారు. 
ఈ మధ్య కాలంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా శ్రీకాకుళంలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఎచ్చర్ల నియోజకవర్గంలో. అయితే నాగబాబు ఏమైనా ఎచ్చర్ల నుంచి ఈసారి పోటీ చేస్తారా అనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే షాకింగ్ విషయం ఏంటంటే పనవ్ కల్యాణ్ ఈసారి ఎచ్చర్ల నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే అరకు పార్లమెంట్ నుంచి కూడా జనసేనే పోటీ చేస్తుందని అంటున్నారు.
ఇప్పటివరకు ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీ బలంగా ఉంటూ వచ్చింది. 2024లో అంత స్ట్రాంగ్ వేవ్ లో కూడా కూటమి రెండు చోట్ల మాత్రమే గెలవగలిగింది. ఎక్కువగా వైసీపీకే ఓట్లు వచ్చాయి. అంతలా గిరిజనుల్లో వైసీపీ పాతుకుపోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా తన ఆచరణ ద్వారా గిరిజనుల్లోకి చొచ్చుకుపోవాలని.. జనసేన ఆ ప్రాంతాల్లో బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పాలకొండ, పోలవరం రెండూ జనసేన ఖాతాలోనే ఉన్నాయి. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎటూ తెలుగుదేశం మనిషే. 
అయితే పిఠాపురం సంగతేంటి? అనే ప్రశ్న వస్తుంది. ఎప్పటికీ పిఠాపురం వదిలేది లేదని పవన్ ఇప్పటికే చెప్పాడు కూడా. మరి పిథాపురం నుంచి కూడా పవన్ పోటీ చేస్తారా.. లేక జనసేన తరపు నుంచి మరొకరు చేస్తారా అనేది మరో చర్చ. మొత్తం మీద పవన్ ప్లానింగ్ మామూలుగా లేదని వీటన్నిటిని గమనించినవారు అనుకుంటున్నారు.