మార్చి సెకండ్ హాఫ్ లో బాక్సాఫీస్ బ్లాస్ట్..

Mar 16, 2026 - 16:04
 0  2
మార్చి సెకండ్ హాఫ్ లో బాక్సాఫీస్ బ్లాస్ట్..

సమ్మర్ సీజన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్. ఈ కాలంలో ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. అందుకే నిర్మాతలు, హీరోలు తమ పెద్ద సినిమాలను ఈ టైమ్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. జనవరిలో కొన్ని పెద్ద సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ, ఫిబ్రవరి నెల మాత్రం కాస్త సైలెంట్‌గా గడిచింది. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆశలు మార్చి నెలపైనే ఉన్నాయి. వేసవికి ప్రారంభంగా భావించే ఈ నెలలో చిన్న సినిమాల నుంచి భారీ సినిమాల వరకు వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మార్చి ఫస్ట్ హాఫ్ లో చిన్న తరహా సినిమాలు రిలీజ్ అయినా.. సెకండ్ హాఫ్ లో మాత్రం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి ముహుర్తం ఫిక్స్ చేశారు. కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా విజువల్‌గా చాలా గ్రాండ్‌ గా ఉంటుందని చెబుతున్నారు. 

ఇక అదే రోజున బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ యాక్ట్ చేసిన దురందర్ 2 కూడా విడుదల కానుంది. ఈ సినిమాను ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్నారు. స్పై థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఒకే రోజు ఈ రెండు భారీ సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండబోతోంది. ఇక మార్చి 26న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సాధించింది. ఈ నెలలో వచ్చే పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌కు మళ్లీ మంచి జోష్ తీసుకురావచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.