మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
#tirupati #Andhrapradesh #rapecase #crime
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన కేసులో గోపీచంద్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అతడు, మరో బాలికను మోసం చేసి తన వలలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్య పరీక్షల్లో ఆమె గర్భవతిగా ఉన్నట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 207/2026 కింద పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. కేసుపై మరింత విచారణ కొనసాగుతున్నట్లు తిరుపతి రూరల్ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.