సుగుణాభిరామా
#Vijayawada #OneTownCI #Gunaram #APPolice #AndhraPradesh #PoliceOfficer #PublicSafety #CommunityPolicing #CrimeControl #PoliceNews #KanakaDurgaTemple #SocialAwareness #RowdySheeters #PublicService
కుమార్ చంద్ పుల్లగూర
ఖాకీ అనగానే కరుడుగట్టిన గుండె అనుకుంటారు ప్రతిఒక్కరూ.. కానీ ఆ కరడుగట్టిన గుండె వెనుక ఎంతటి మంచి మనస్సు ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఒక ఖాకీ గురించి తెలుసుకోవాలి.. ఆయనే వన్‌టౌన్ సిఐ గుణరామ్. విజయవాడ నగరానికి ఎంత మంది పోలీసు కమీషనర్లు మారినా.. ప్రతిఒక్కరి నోటిలో నానే పేరు గుణరామ్. ప్రస్తుతం వన్‌టౌన్ సిఐగా ఉన్న గుణరామ్ ఇటీవలికాలంలో ఎన్నో సరికొత్త కార్యక్రమాలకు తెరతీసారు. ప్రతి కార్యక్రమం అవగాహనా కార్యక్రమంగా ఉండటమే కాక ప్రజలకు ఉపయుక్తంగా మారాయి. తాను రూపొందించుకున్న ఓ ప్రణాళికను ఎంతో పకడ్బందీగా అమలు చేస్తూ.. ప్రజల మన్ననలను పొందుతున్నారు. వన్‌టౌన్ ఏరియా అంటేనే రౌడీ షీటర్లకు ఒక అడ్డా అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమే కాక కొంత ప్రాంతం కొండే ఎక్కువగా ఉంటుంది. అంటే సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిన నేపధ్యమూ ఈ ప్రాంతానికి లేకపోలేదు. అయితే ఇక్కడ ఉన్న సమస్యలను బాగా ఆకళింపు చేసుకున్న సిఐ గుణరామ్.. ముందుగా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ అదేవిధంగా ఓ స్వీట్ వార్నింగును ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ అనంతరం రౌడీ షీటర్ల కార్యకలాపాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. ఒక్క కౌన్సిలింగ్ మాత్రమే కాకుండా పెట్రోలింగ్ ను, బీట్ సిస్టమ్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు గుణరామ్.
అదేవిధంగా ఆయన ఇటీవల మరొక చేయూత కార్యక్రమానికి కూడా తెరతీసారు. వన్ టౌన్ ప్రాంత పరిధిలో ఉన్న కనకదుర్గమ్మ గుడి వద్ద రోజూ పిల్లలను తమతో ఉంచుకుంటూ యాచకత్వం చేస్తూ ఉండే వారిని సుమారు 80 మందిని తెచ్చి వారికి కౌన్సిలింగ్ ను ఇచ్చి వారికి దుస్తులను, కొంత డబ్బును ఇచ్చి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ పరిణామంతో కనకదుర్గమ్మ గుడి కింద ఉన్న రథం సెంటర్ లో చాలా వరకూ యాచకులు తగ్గారు. అనంతరం గుణరామ్ తీసుకున్న మరొక కార్యక్రమం ఏంటంటే.. మల్లిఖార్జునపేటలోని క్వారీ సెంటర్ వద్ద రోజూ తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారని తెలిసి అక్కడి చిన్నారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల రోజు ఆ ప్రాంతంలో జరిగే పలు గొడవలు, ఇబ్బందులను ఆయన తొలగించారు. మరొక విషయం ఏంటంటే.. రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేసి ప్రజల భద్రతకు బాటలు వేయాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు వెళుతున్నారు.