Close Menu
    Quick Links
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • About Us
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • తెలుగు
    Tuesday, September 15
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • AP
    • Telangana
    • National
    • International
    • Politics
    • Business
    • More
      • Devotional
      • Science & Technology
      • Health
      • Sports
      • Entertainment & Movie Updates
      • Environment & Weather
    Install Our APP
    True Point News
    Home»National»రూ.3,383 కోట్ల ఆస్తులు.. అయినా ఒక్కరోజు బిచ్చగాడిగా..!
    National

    రూ.3,383 కోట్ల ఆస్తులు.. అయినా ఒక్కరోజు బిచ్చగాడిగా..!

    Point News Point NewsBy Point News Point NewsSeptember 15, 2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కోట్ల రూపాయల ఆస్తులు, రాజకీయ హోదా, భద్రతా సిబ్బంది, ఖరీదైన వాహనాలు.. ఇవన్నీ ఉన్నప్పటికీ మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్‌ షా ఒక్కరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు. ఆయన చేసిన ఈ ప్రయోగం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. డబ్బు, హోదా కంటే మానవత్వమే గొప్పదనే సందేశాన్ని ఈ ఘటన ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులు

    రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న పరాగ్‌ షా.. 2024 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. సాధారణంగా ఆయన చుట్టూ భద్రతా సిబ్బంది, ఖరీదైన వాహనాలు, రాజకీయ హోదా కనిపిస్తుంటాయి. అయితే, ఆ హంగూ ఆర్భాటాలన్నింటినీ పక్కనపెట్టి.. ఒక రోజు మాత్రం సామాన్యుడి జీవితాన్ని అనుభవించాలని నిర్ణయించుకున్నారు.

    తన ఆధ్యాత్మిక గురువు సూచన మేరకు జైన సంప్రదాయంలోని ప్రత్యేక మాసం సందర్భంగా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని ఘట్కోపర్‌ ప్రాంతంలోని వీధుల్లో బిచ్చగాడి వేషంలో కూర్చున్నారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా మేకప్‌ వేసుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం అక్కడికి వచ్చే ప్రజలను ఆహారం, డబ్బు అడుగుతూ కొంతసేపు గడిపారు.

    ప్రజల స్పందనతో భావోద్వేగ అనుభవం

    ఈ సమయంలో పలువురు ఆయనకు తమకు తోచినంత సహాయం చేశారు. ఓ వ్యక్తి రూ.20 ఇచ్చి.. “వెళ్లి తిను బాబా” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు, తన దగ్గర డబ్బులు లేవని చెప్పిన ఓ సమోసా వ్యాపారి.. డబ్బులు తీసుకోకుండానే చిరునవ్వుతో సమోసా ఇచ్చాడు. ఈ సంఘటన పరాగ్‌ షాను ఎంతగానో కదిలించినట్లు తెలుస్తోంది.

    కొన్ని గంటల తర్వాత ఆయన మేకప్‌ తొలగించుకుని, తాను బిచ్చగాడి వేషంలో తిరిగిన ప్రాంతాలకే మళ్లీ వెళ్లారు. అక్కడి ప్రజలు తనను ఎలా చూశారు? ఎలాంటి ప్రవర్తన కనబరిచారు? అనే విషయాలను గమనించారు.

    “అదే జీవితంలోని వాస్తవం”

    ఈ అనుభవం గురించి పరాగ్‌ షా మాట్లాడుతూ.. “నన్ను కలవడానికి వచ్చే ప్రజలే.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారు. అదే జీవితంలోని వాస్తవం” అని వ్యాఖ్యానించారు.

    BJP maharastra mumbai National parag sha
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    Rs 3,383 Crore Assets, Yet BJP MLA Spends a Day as a Beggar

    September 15, 2026

    UPI Payments: No Charges on Transactions Up to ₹2,000

    September 15, 2026

    UPI: రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు

    September 15, 2026

    Heavy Rain Alert for Telugu States

    September 15, 2026

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 2026

    బ్రిక్స్ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం

    September 12, 2026
    Leave A Reply Cancel Reply

    Top Posts

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 20266 Views
    Don't Miss

    Rs 3,383 Crore Assets, Yet BJP MLA Spends a Day as a Beggar

    September 15, 2026

    Maharashtra BJP MLA Parag Shah has drawn attention on social media after spending a day…

    రూ.3,383 కోట్ల ఆస్తులు.. అయినా ఒక్కరోజు బిచ్చగాడిగా..!

    September 15, 2026

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    యుద్ధ ప్రభావం.. అమెరికాలో తగ్గిన నిల్వలు

    September 15, 2026
    Special Stories
    8.9

    Review: Dell’s New Tablet PC Can Survive -20f And Drops

    January 15, 2021

    Review: Kia EV6 2022 The Best Electric Vehicle Ever?

    January 14, 2021
    72

    Review: Animation Software Business Share, Market Size and Growth

    January 14, 2021
    Most Popular

    ఇంకెన్ని కలుగులు ఉన్నాయో..?

    September 12, 202641 Views

    19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. డిసెంబర్‌ కోటా విడుదల

    September 12, 20267 Views

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

    September 15, 20266 Views
    Our Picks

    Rs 3,383 Crore Assets, Yet BJP MLA Spends a Day as a Beggar

    September 15, 2026

    రూ.3,383 కోట్ల ఆస్తులు.. అయినా ఒక్కరోజు బిచ్చగాడిగా..!

    September 15, 2026

    Iran War Impact: Heavy Damage to US Defense Sector

    September 15, 2026

    Subscribe to Updates

    Get the latest news from True Point.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • Home
    • Advertise
    • Get In Touch
    • E-Paper
    • Truepoint App
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.