ఇబ్రహీంపట్నంలో వైసీపీ శ్రేణుల ఆందోళన
Feb 14, 2026 - 12:20
0
2
ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ అభిమానులు, యువకులు పోలీసులపై రెచ్చిపోయారు. సీఎం జగన్ అంటూ నినాదాలు చేస్తూ భారీగా తరలివచ్చారు. జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రానున్న నేపథ్యంలో రింగ్ సెంటర్ వద్ద కార్యకర్తల రద్దీ పెరిగింది. బైక్ స్టంట్లతో కోలాహలం నెలకొనగా, స్టంట్లు చేస్తున్న యువకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.